DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో మాజీ శాసనసభ్యులు, ఆదోని టిడిపి ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా మున్సిపల్ మెయిన్ రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలహారం వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆర్యవైశ్య సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుడని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరాహార దీక్ష చేసి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వల్లే తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఆయన ఆశయాలు, సేవాభావం, త్యాగస్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, వారి మార్గాన్ని అనుసరిస్తూ సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉమాపతి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు.
Admin
DNB News