DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలో వెలసిన శ్రీ గంగాభవాని దేవాలయం భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించే గంగా జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని గంగపుత్ర సంఘం సమావేశంలో తీర్మానించారు. ఆదివారం శ్రీ గంగాభవాని దేవాలయంలో నిర్వహించిన గంగపుత్ర సంఘం సమావేశంలో గంగపుత్ర సంఘం నాయకులు తెలుగు ఈరన్న, మేస్త్రి శ్రీనివాసులు, కోర్టు అంబన్న, ట్రాన్స్కో రాజు, ఆటో వెంకటేష్, మేఘనాథ్, దొడ్ల కృష్ణమూర్తి, డైరెక్టర్ రామాంజనేయులు, మైలప్ప ఈరన్న, సోమప్ప, గుండ్లవీధి లక్ష్మన్న, గోపి, రాయచూర్ రాజు, ధనాపురం వీరేష్, సున్నం రామాంజనేయులు, కోడిగుడ్ల రాజశేఖర్, తెలుగు నరేష్, కార్పెంటర్ ఈరన్న, కార్పెంటర్ తాయప్ప, భాస్కర్, విశ్వనాథ్, మేస్త్రి నగేష్, బెస్త నారాయణ, బెస్త రాజేష్, బెస్త లక్ష్మన్న, జనసేన వీరేష్, చిదానంద, మల్లికార్జున, సురేంద్ర, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జూన్ 24వ తేదీన శ్రీ గంగాభవాని దేవాలయంలో గంగా జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అమ్మవారి ఊరేగింపును ఘనంగా చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. గంగా జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News