DNB News - ఆంధ్రప్రదేశ్ / : తూర్పుగోదావరి జిల్లాలో చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు రాత్రంతా డ్రోన్ లతో ప్రత్యేక నిఘా. రాత్రి సమయంలో జిల్లాలో అసాంఘిక శక్తులను, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయాలని లక్ష్యంగా డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., ఆదేశాల మేరకు జిల్లా అంతట ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో బహిరంగంగా మద్యం సేవించడం ,గంజాయి సేవించడం,పేకాట, ఈవిటిజింగ్, చైన్ స్నాచింగ్, జూదం తదితర నేరాల పై ప్రతిరోజు రాత్రి సమయాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పాడుపడిపోయిన ఇల్లు, అపార్ట్మెంట్ల మీద, నివాస గృహాల పై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం జరుగుతుంది
Admin
DNB News