DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేటి (సోమవారం) నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను రాస్తున్న విద్యార్థులందరికీ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలను ధైర్యంగా రాయాలని సూచించారు. విద్యార్థులు ఇప్పటివరకు చేసిన కృషిపై నమ్మకం ఉంచుకుని ప్రతి ప్రశ్నకు సమగ్రంగా సమాధానాలు రాయాలని కోరారు. పరీక్షలు జీవితంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని, వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ పరీక్షలు విజయానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిస్తూ, అన్ని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని అభిలాషించారు. “ఆల్ ది బెస్ట్” అంటూ విద్యార్థులకు శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
DNB News