DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈ నెల 6వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కలెక్టర్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, సభా ప్రాంగణం, వీఐపీ రూట్, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటన సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Admin
DNB News