DNB News - ఆంధ్రప్రదేశ్ / : కొల్లివలసలో 2 కోట్లు 80 లక్షల రూపాయలుతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన *ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆమదాలవలస నియోజకవర్గ అభివృద్ధికి మరొక కీలక అడుగు పడింది. బూర్జ మండలంలోని కొల్లివలస గ్రామం నుండి వయా గుత్తవిల్లి ఆముదాలవలస మండలంలోని అక్కులపేట గ్రామం వరకు నిర్మించబోయే బీటీ రహదారికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా చేశారు ఈ కార్యక్రమానికి ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ రహదారుల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. కొల్లివలస – అక్కులపేట మధ్య బీటీ రహదారి నిర్మాణం వల్ల రెండు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు సులభంగా ప్రయాణించగలరని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణం వలన ఈ ప్రాంత రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు త్వరగా సులభంగా తరలించగలరని, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుకోవడం సులభమవుతుందని అన్నారు. గ్రామాల మధ్య అనుసంధానం బలపడటంతో అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అక్షరాలా నెరవేర్చే దిశగా తాము కృషి చేస్తున్నామని, ఆమదాలవలస నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని కూన రవికుమార్ గారు పేర్కొన్నారు. ప్రజల సహకారం, ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News