DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని కోతుల బావి ప్రాంతంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పరిరక్షణ మరియు అభివృద్ధి కోసం హిందూ బంధువులకు అత్యవసర పిలుపునిచ్చారు. రేపు అనగా 28-02-2026న నిర్వహించబడే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా దేవాలయ పరిరక్షణ అంశంపై వినతిపత్రాన్ని మున్సిపల్ చైర్మన్, కమిషనర్ మరియు పట్టణ కౌన్సిలర్లకు సమర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10:00 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జరుగనుంది. అందువల్ల ప్రతి హిందూ బంధువు తన పనులను పక్కన పెట్టి మున్సిపల్ కార్యాలయానికి హాజరై దేవాలయ పరిరక్షణకు మద్దతు తెలపాలని కోరారు. దేవాలయ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ఐక్యతతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.
Admin
DNB News