DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలోని భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అన్యాయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నియమ నిబంధనలను పూర్తిగా విస్మరించి, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై విద్యార్థుల అడ్మిషన్‌లు తీసుకురావాలని ఒత్తిడి తెస్తున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను బోధనకు బదులుగా అడ్మిషన్‌ల కోసం ఉపయోగించడం విద్యా వ్యవస్థను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఈ పరిస్థితిని వెంటనే ఆపాలని, సంబంధిత విద్యాసంస్థలపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ని కలిసి సమస్యను వివరించేందుకు వెళ్లిన డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులను అడ్డుకున్న ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ చర్యను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, భాష్యం, చైతన్య నారాయణ, విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
DNB News