DNB News - ఆంధ్రప్రదేశ్ / : మునగాల: క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతో ద్రోహదపడతాయని పలువురు తెలిపారు.ఆదివారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా కోదాడ జర్నలిస్టులు స్థానిక కటకొమ్మ గూడెం రోడ్డు బైపాస్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, జర్నలిస్టులు నిత్యం వార్తా విధుల్లో నిమగ్నమయి వారి ఆరోగ్యాలను కూడా లెక్కచేయకుండా ఉంటారు. అలాంటి వారికి క్రీడా పోటీలు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించినట్లయితే ఈ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారనిఅన్నారు.ఇలాంటి కార్యక్రమాలు జర్నలిస్టుల మధ్య ఐక్యతను, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈకార్యక్రమంలో మాతంగి సురేష్, జూలూరి బసవయ్య, శ్రీకాంత్, శ్రీహరి, చరణ్, శ్రీనివాస్, మణికంఠ, కృష్ణ, వాసు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News