DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు మరియు బాల్య వివాహాల నివారణకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు మరియు టీనేజ్ గర్భధారణలు సమాజానికి తీవ్రమైన సమస్యలని, వీటి నిర్మూలన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు చేపట్టి, బాలికల విద్యాభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
Admin
DNB News