DNB News - ఆంధ్రప్రదేశ్ / : 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమదాలవలస శాసనసభ్యులు, పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సమగ్ర అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత దేశ భవిష్యత్తును నిర్మించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
Admin
DNB News