DNB News - ఆంధ్రప్రదేశ్ / : పూలే-అంబేద్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సొసైటీ నిర్వాహకులు నరసన్న, గౌరవ అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్, గౌరవ సలహాదారులు కామెలే గణేష్, సమాజ సేవకులు డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా పాల్గొన్నారు. అలాగే సొసైటీ శాశ్వత సభ్యులు ఎస్. చాంద్ భాషా, యం. బతకన్న, లాల్కోట్ ఖదీర్, బాబు, సురేష్ తదితరులు హాజరై గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లడం అత్యంత అవసరమని తెలిపారు. సమాజంలో సమానత్వం, విద్యాభివృద్ధి కోసం వారి సిద్ధాంతాలు మార్గదర్శకాలని పేర్కొన్నారు.
Admin
DNB News