DNB News - ఆంధ్రప్రదేశ్ / : మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ అనుబంధ కమిటీల (Parliament Affiliate Committees) ఏర్పాటుపై ముఖ్యమైన చర్చలు నిర్వహించారు ఈ సమావేశంలో జోనల్–5 కోఆర్డినేటర్ బీద రవిచంద్ర, ప్రోగ్రామ్ కమిటీ ఇంచార్జి రాంబాబు, కర్నూలు పార్లమెంట్ కోఆర్డినేటర్ వీరయ్య చౌదరి సూచనల మేరకు కర్నూలు జిల్లా నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆదోని నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, ఎంఎల్సీ బీటి నాయుడు పాల్గొన్నారు. పార్లమెంట్ స్థాయి కమిటీలను బలోపేతం చేసి పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత శక్తివంతం చేయాలనే దిశగా సమావేశంలో చర్చలు జరిగాయి. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
Admin
DNB News