Friday, 19 June 2026 02:06:02 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మహిళా లోకానికి , దేశానికి ఏప్రిల్ 17 బ్లాక్ డే

Date : 18 April 2026 06:31 PM Views : 40

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకోవడమే కాంగ్రెస్ నైజం. బిల్లును వ్యతిరేకించి మహిళలు చట్టసభల్లోకి రాకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. అవమానించింది. ఇండియా కూటమి, కాంగ్రెస్ లు కలిసి బిల్లును ఓడించాయి.. మహిళలను ఓడించాయి... బిజెపి జిల్లా అధ్యక్షులు గంగా డి కృష్ణారెడ్డి.... మహిళా లకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే, నారీ శక్తి వందన్ అధినియం బిల్లును కాంగ్రెస్ , ఇండియా కూటమి అడ్డుకొని మహిళలకు తీవ్ర అన్యాయం చేశాయని, ఏప్రిల్ 17 దేశానికి, మహిళా లోకానికి చీకటి రోజు లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇండియా కూటమి తీరును నిరసిస్తూ హుజురాబాద్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజున బిజెపి శ్రేణులు నల్ల జెండా లతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ఏ చట్టాన్ని అయిన వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ ఓర్వ లేకపోయిందని ఘాటుగా విమర్శించారు.. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఏప్పుడు కూడా సహకరించిన పాపన పోలేదన్నారు. కాంగ్రెస్ మొదటినుంచి మహిళా వ్యతిరేకే అన్నారు. విపక్షాల అసలు స్వరూపం బయటపడిందని, మహిళలకు ద్రోహం చేస్తుంది ఎవరో దీంతో బహిర్గతమైందన్నారు. నారీశక్తికి పెద్దపీట వేస్తూ, దేశాభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యలు చేయాలన్న ప్రధాని మోదీ దృఢ సంకల్పానికి విపక్షాలు మరోసారి అడ్డుపడ్డాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించి మహిళా వ్యతిరేకత వైఖరిని బహిర్గతం చేసుకున్నయన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి పార్లమెంటు సాక్షిగా మహిళా హక్కులను బాల రాయడం వారి ద్వంద నీతికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఇండియా కూటమి బిల్లును వ్యతిరేకించాయని తెలిపారు. చారిత్రక బిల్లును అడ్డుకొని కాంగ్రెస్, ఇండియా కూటమి లు చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోయారని ఆయన ఘాటుగా విమర్శించారు. డీలిమిటేషన్, మహిళల 33 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ ను దేశం ఎప్పటికీ క్షమించదని, ముఖ్యంగా మహిళలు కాంగ్రెస్ , ఇండియా కూటమి మహిళల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళల విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారని , అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఆరూ గ్యారెంటీలతో మహిళలను తీవ్రంగా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. తులం బంగారం, ప్రతినెల 2500, కళాశాల విద్యార్థినిలకు స్కూటీలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయని, మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ కు , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని ఘాటుగా విమర్శించారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు మండల అధ్యక్షులు పారుపల్లి కొండల్ రెడ్డి కందుకల సర్పంచ్ ముప్పుమహేష్ జిల్లా కౌన్సిల్ నెంబర్ రావులవేణు జిల్లాకార్యవర్గసభ్యులు గంగిశెట్టిప్రభాకర్ పట్టణ కౌన్సిలర్లు పంజాలమనోజ్ కొండప్రశాంతిమురళి కొలుగూరి సుమలతసుమన్ తూర్పాటి లక్ష్మీదుర్గ పైళ్లవెంకట్రెడ్డి గంగిశెట్టిరాజు యాంసానిశశిధర్ కందుగుల సర్పంచ్ ముప్పుమహేష్, రావుల పున్నంచందర్, ధర్మరాజు పల్లి ఉపసర్పంచ్ ఆవుల రాజ్ కుమార్, నరాల రాజశేఖర్ తిప్పబతిని రాజు యాళ్ల సంజీవరెడ్డి సబ్బని రమేష్ గంటసంపత్ కొల్లిపాకశ్రీనివాస్ కొలిపాక వెంకటేష్ కొలుగూరిఅనిల్ ఎర్రశ్రీధర్ కుతాడి కుమారస్వామి గోవిందుల భాస్కర్ గోట్టే రవీందర్ సబ్బనిమాధవి కుసుమసమ్మయ్య మొలుగూరిఅపర్ణ నగేష్ బెజ్జంకి రాజేందర్ మొలుగూరిరాజు క్యాసవెంకటేష్ నీలంరవీందర్ పురాణంశ్రీనివాస్ బండారు లావణ్య, బైరెడ్డి సంపత్ రెడ్డి ,పోచంపల్లి సహదేవ్, గాజే ఓదెలు, మెడవేని కుమార్,అనిల్, రఘుపతిరెడ్డి,కిరణ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లో బిజెపి శ్రేణుల నిరసన... మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల కాంగ్రెస్ , ఇండియా కూటమి వ్యవహరించిన తీరును నిరసిస్తూ కరీంనగర్ బీజేపీ శ్రేణులు తెలంగాణ చౌకలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్, ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఈ సందర్భంగానినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ మేయర్ కొలగని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్ పార్లమెంటులో కాంగ్రెస్ , ఇండియా కూటమి మహిళా బిల్లును వ్యతిరేకించిన విధానంపై మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామంటే హర్షించాల్సిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి బిల్లును అడ్డుకొని వీగిపోయేలా చేయడం సరికాదన్నారు. మహిళల పట్ల కాంగ్రెస్, ఇండియా కూటమికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ బిల్లు అంశంతో తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళ లోకానికి తీవ్ర అన్యాయం చేశాయన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్, ఇండియా కూటమి చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోయారని విమర్శించారు. మహిళలను చట్టసభల్లోకి రాకుండా అడ్డుకోవడం కాంగ్రెస్ కే చెల్లిందని ఈ సందర్భంగా వారు ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు మహిళా బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమని, పైగా సంబరాలు చేసుకోవడం ఏంటని వారు ప్రశ్నించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: