DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా... కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం గావించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీఐజీ పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి సేవ చేయడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఐజీ మేనేజర్ రత్న ప్రకాష్, లైజనింగ్ ఆఫీసర్ తిక్కస్వామి, డీఐజీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News