DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలానికి చెందిన వీఆర్వో సురేష్ ఇంటికి వెళ్లి స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి పరామర్శించారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో వీఆర్వో సురేష్‌ను ఓ టీడీపీ నాయకుడు నిర్బంధించాడనే సమాచారం నేపథ్యంలో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులను కలిసి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, నిర్బంధించడం వంటి చర్యలు అత్యంత ఖండనీయమన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదని అన్నారు. వీఆర్వో సురేష్‌కు జరిగిన అన్యాయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
Admin
DNB News