Saturday, 18 April 2026 06:06:25 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలి – కూలీల హక్కుల కోసం CPI–BKMU పాదయాత్రకు పిలుపు

Date : 10 April 2026 04:18 PM Views : 23

DNB News - ఆంధ్రప్రదేశ్ / : దేశంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించి, ప్రభుత్వం మార్చిన పేర్లను తొలగించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొత్తూరు గంగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఏప్రిల్ 10 నుండి 12 వరకు నిర్వహించనున్న పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను సిపిఐ–బికేఎంయు నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూలీలను బానిసలుగా మార్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు హామీగా ఉన్న 100 రోజుల పనిని పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల, జిల్లా వ్యాప్తంగా 30 రోజులు కూడా పని దొరకని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు రాజకీయ ఒత్తిళ్లకు లోనై పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో వేలాది కుటుంబాలు ఆకలి కష్టాలతో జీవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలు, వెనుకబడిన మండలాలు, మహిళలు, వృద్ధులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు, వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డిమాండ్లు: జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 100 రోజుల గ్యారంటీ పని ఇవ్వాలి. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి జాబ్ కార్డులపై జరుగుతున్న అక్రమాలను తక్షణం నిలిపివేయాలి అధికారుల అవినీతి, నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి గ్రామాల్లో జరుగుతున్న బోగస్ పనులపై ప్రత్యేక దర్యాప్తు జరపాలి ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కే. రమేష్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి బి.జి. ఎల్లప్ప, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సత్యనారాయణ, నియోజకవర్గ కార్యదర్శి బసాపురం గోపాల్, నాయకులు శేషప్ప, ఈరన్న, విజయ్ కుమార్, పుష్పరాజ్, లక్ష్మన్న, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :