Wednesday, 17 June 2026 02:14:10 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించిన - పిసిని చంద్రమోహన్

Date : 02 April 2026 03:19 PM Views : 54

DNB News - ఆంధ్రప్రదేశ్ / : •హింసించేరాజు 23వ పులకేశి అని ఒక తమిళ డబ్బింగ్ సినిమా వచ్చింది. వడివేలు హీరో. ఆ సినిమాలో వడివేలు తీసుకున్న పిచ్చి నిర్ణయాలకు అతడితో పాటు అతడి రాజ్యం కోసం ప్రతిసారీ చిక్కుల్లో పడుతుంది. ప్రజల ముందు తలదించుకోవల్సి వస్తుంది. జగన్ కూడా సేమ్ వడివేలు క్యారెక్టర్ కి సీక్వెల్ లాంటివాడు. 24వ పులకేశి. ప్రజలను హింశిస్తున్నాడు అని ఈ ఆంధ్రా పులకేశిని ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోపెట్టినా బుద్ధి మారలేదు. • ఈరోజు మాజీ ముఖ్యమంత్రి Y S జగన్మోహనరెడ్డి ప్రెస్మీట్ ఆద్యంతం అవాస్తవాలే.. • పారదర్శకంగా… అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతున్న అమరావతిపై ఆయన అక్కసు వెళ్లగక్కారు. భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు. తనకేమైనా అనుమానాలు ఉంటే అసెంబ్లీలో ప్రశ్నించాల్సింది పో __ యి… అసెంబ్లీలో అడుగు పెట్టకుండా బయట అవాకులు చెవాకులు మాట్లాడడం సరికాదు. రాష్ట్రానికి రాజధాని అనేదే రాజ్యాంగంలో లేదంటాడు. తను మూడు రాజధానులు ఏర్పాటు చేశానంటాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు లను కలిపి మావిగన్ పేరుతో ఏర్పాటు చేయవచ్చు కదా అని సలహా ఇస్తారు. ఈయన తీరు చూస్తుంటే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని భావించాల్సి ఉంటుంది. • పవన్ కల్యాణ్ గారు ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మన పంచాయతీలను నిలిపే కృషి చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో వచ్చిన ఐదు అవార్డులు జగన్ కు కనిపించడం లేదా… జనసేన అధినేత పవన్ గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ప్రెస్మీట్ పెట్టడానికే బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చే జగన్ …. పవన్ కల్యాణ్ గారిపై కామెంట్స్ చేయడం సిగ్గుచేటు. అయ్యా జగనూ నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నమ్మరు. కూటమి పాలనలో ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా ఉన్నారు. • వైసీపీ విధానం రాజధాని విషయంలో మొదటి నుంచి సరిగా లేదు. ఒక సిద్ధాంతం గానీ, స్పష్టత గానీ, విధానం గాని లేని పార్టీ అది. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, రాష్ట్రంలో అభివృద్ది లేకుండా అరాచకం జరగాలనేది ఆ పార్టీ కాన్సెప్ట్. బాప్ ఏకీ హే బేటా దస్ నంబర్ హే అనేలా... ఆ పార్టీ నాయకుడి ఆలోచనే ఆ పార్టీ నేతలకు ఉంటుంది. విధ్వంసం, అశాంతిని మాత్రమే ఆ పార్టీ బలంగా కోరుకుంటుంది. • అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి అయిదేళ్లు సెట్లు వేసుకొని అదే పాలన అని, బటన్లు నొక్కడమే సంస్కరణలు అని అనుకున్న వాడికి రాజధాని విషయంలో పెద్ద కలలు ఉండాలని అనుకోవడం భ్రమ. వైసీపీ పాలలో ఒక స్థిరమైన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పరచకుండా ఐదు కోట్ల ఆంధ్రులని మోసం చేశారు. అధికారం పోయాక ఇప్పుడు మూడు అభివృద్ధి రీజియన్లు, ప్లాన్ బి అంటూ MAVIGUN అనే కొత్త పాట పాడుతున్నారు. ఈ మూడు ముక్కలాట విధానం... రాత్రి ఏ పబ్ జీ గేమ్ లో చూశాడో మళ్లీ మొదలుపెట్టాడు. మావిగన్ అంటే ఏదో గేమ్ పేరులా ఉంది. • కూటమి ప్రభుత్వం కూడా రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీనికి తగిన ప్రణాళికతో ముందుకు వెళుతోంది. 2024లో మూడు ముక్కలాట ఆడిన జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా ఆయన బుద్ధి మారలేదు. • అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర తగిన విధంగా సహకరిస్తోంది. అమరావతి ప్రాధాన్యతనను కేంద్రం గుర్తించింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పునర్నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రౌండింగ్ చేశాం. బడ్జెట్ లో అమరావతికి తగని ప్రాధాన్యం ఇచ్చాం. • అమరావతి పనులు వేగం పుంజుకోవడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలను భయపెట్టేలా, పెట్టుబడిదారుల్లో అయోమయం నెలకొల్పేలా మరోసారి మూడు రీజియన్లు అంటూ నాటకం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని అది అమరావతి మాత్రమే.. • ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు చేస్తున్నారు అని జగన్ ఆరోపిస్తున్నారు... పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు.. ఎక్కడ ఉంటున్నారో.. ఎలా పాలన చేస్తున్నారో జగన్ ఒకసారి పరిశీలిస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారి పనితీరు అర్థం అవుతుంది. 25వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ను ఒకటో స్థానానికి తీసుకువచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. కనీసం సచివాలయానికి కూడా వెళ్లకుండా సెట్లు వేసి పరిపాలన చేసిన మీరు.. పవన్ కళ్యాణ్ గారిని అనడానికి సరిపోరు. • గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి ఏ మంత్రి ఉండేవారో కూడా తెలియని పరిస్థితి నుంచి గర్వంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి శాఖగా చెప్పుకొనే పనులు చేశారు. సంస్కరణలు తెచ్చారు. గ్రామీణ వికాసానికి దారి చూపుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ముందుచూపు, ఆయన ఆలోచనలు అత్యుత్తమమైనవి. అవి ఆకాశం లాంటివి.. దాని మీద ఉమ్మి వేస్తే అది తిరిగి మళ్లీ జగన్ మీదనే పడుతుంది. జాగ్రత్త... • మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లి, గిరి పుత్రుల బాధలను అర్థం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారు. డోలి రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ అడవి తల్లి బాట పేరుతో బ్రహ్మండంగా అభివృద్ధి చేస్తున్నారు. Press meet అవగానే బెంగళూరు వెళ్ళిపోయే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు..?? • అమరావతికి వైసీపీ వ్యతిరేకం అని ప్రజల ముందు చెప్పండి. అంతేగాని లేనిపోని కారణాలు చెప్పి పార్లమెంట్లో రాష్ట్ర రాజధాని బిల్లుకు మద్దతు ఇవ్వకకపోవడం వైసీపీ కుట్రపూరిత ఆలోచనలకు ప్రతిరూపం. • జగన్ రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు అని చెప్తున్నారు.. మీ హయాంలో మరి మూడు రాజధానులు అని ఎలా అన్నారు...?. • అధికారంలో ఉన్నప్పుడు సొంత పేర్లు పథకాలకి, ఊర్లకి, ప్రభుత్వ కార్యక్రమానికి పెట్టుకున్న మీరు రాజధాని విషయంలో కూడా మీ పేరు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా పేర్లు పిచ్చి పోలేదు. అంతగా పిచ్చి ఉంటే మీ ఇంటికి జగన్ జంగిల్ అనిపెట్టుకోండి. • ఈ పేర్లు పిచ్చి, రంగులు పిచ్చి మీకు ఎప్పటికీ పోదు. వైసీపీకి ప్రజలు 11 ఇచ్చినా బుద్ధి రాలేదంటే... మరోసారి దీనిపై ప్రజలు కూడా సీరియస్ గా ఆలోచించి... అవి ఇవ్వడం కూడా వృధా అనేలా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తీర్పు ఇస్తారు. ఈ మీడియా సమావేశంలో హాజరైన జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, శ్రీకాకుళం నియోజకవర్గం సామానవ్యయకర్త కోరాడ సర్వేశ్వరరావు, జిల్లా నాయకులు వాడవలస సురేష్ కుమార్, మామిడి విష్ట్ను, ముంగి జగదీశ్, బొట్ట శంకర్ యాదవ్, మచ్చ బుచ్చిబాబు,చిరంజీవి,తదితరనాయకులు హాజరు అయినారు,

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :