Monday, 15 June 2026 01:48:29 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

రాష్ట్రస్థాయి మాస్టర్స్ క్రీడల్లో కర్నూలు పోలీసు క్రీడాకారుల ప్రతిభ – ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందనలు..

Date : 02 April 2026 05:18 PM Views : 78

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రస్థాయి మాస్టర్స్ క్రీడల్లో కర్నూలు పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ SAP లీగ్ మాస్టర్స్ క్రీడల్లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్న ఆర్‌ఎస్సై మరియు కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మార్చి 30, 31 తేదీలలో 35–45 సంవత్సరాల వయస్సు విభాగంలో ఈ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఆర్‌ఎస్సై పి.ఆర్. మహేశ్వరరెడ్డి, కానిస్టేబుల్ శివకుమార్ పతకాలు సాధించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో విజేతలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన మెడల్స్ మరియు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. పోలీసు విధుల్లో ఒత్తిడి మధ్య కూడా క్రీడల్లో రాణించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆర్‌ఎస్సై పి.ఆర్. మహేశ్వరరెడ్డి 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, 1500 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం సాధించారు. గత ఐదేళ్లుగా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొంటూ చెన్నై నేషనల్ మీట్‌లలో కూడా ప్రతిభ కనబరిచారు. కానిస్టేబుల్ శివకుమార్ (కర్నూలు ట్రాఫిక్ పీఎస్) లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించారు. గతంలో సౌత్ జోన్ నేషనల్స్, కేరళ జూనియర్స్ నేషనల్స్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చాటారు. వీరిద్దరూ జాతీయ స్థాయి క్రీడల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ జావేద్, మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :