DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌లో మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ… లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. స్థలం సర్వే రిపోర్టు ఇవ్వడానికి యజమాని వద్ద నుంచి రూ.50 వేల నగదు తీసుకుంటుండగా… ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం రామకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అతనితో పాటు సర్వే సిబ్బంది, కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారిస్తున్నారు. మున్సిపల్ సర్వేయర్‌గా, అలాగే ఇన్‌ఛార్జ్ డివిజనల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న రామకృష్ణపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది
Admin
DNB News