DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ Mojtaba Khamenei తీవ్రంగా గాయపడినట్టు అమెరికా రక్షణ మంత్రి Pete Hegseth సంచలన ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఆ దాడి ప్రభావంతో ఆయన ముఖం తీవ్రంగా దెబ్బతిని గుర్తుపట్టలేని స్థితికి చేరిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Admin
DNB News