DNB News - ఆంధ్రప్రదేశ్ / : రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నరసరావుపేటలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో పనిచేసే యువతి… పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కిడ్నాప్‌కు గురైనట్లు తెలుస్తోంది. ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఉయ్యాల చైతన్య (22) బాధితురాలిగా గుర్తించారు. ప్రతిరోజూ నరసరావుపేట వెళ్లి పని ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకునే ఆమె… ఈసారి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమై… రొంపిచర్ల పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు… తుంగపాడు – నరసరావుపేట మార్గంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులు ఏ దిశగా వెళ్లారనే కోణంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు దారి తీసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Admin
DNB News