DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్ ఐపీఎస్ ప్రత్యేక సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఒంటిమిట్ట ఆలయ ప్రధాన అర్చకులు, పోలీసు అధికారులు సోమవారం కర్నూలులోని డీఐజీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సిఐ నరసింహ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News