DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారధి సమక్షంలో భారీగా పార్టీ మార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద తుంబలం మండలం బీజేపీ మండల అధ్యక్షులు కురువ వేణుగోపాల్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించబడింది. ఆదోని మండలం హనవాలు గ్రామానికి చెందిన బీజేపీ మండల నాయకులు ఆచారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన వీరభద్ర స్వామి, నారాయణ, వెంకటేశు, నాగరాజు, వెంకప్ప, ఆంజనేయ, హుసేని, రమేష్, మల్లేష్, వీరేష్, ఈశ్వర్, బుజ్జి, రేవన్న, రాలింగా, బసప్ప, గోపాల్, గోవిందు తదితర నాయకులతో పాటు దాదాపు 30 కుటుంబాలు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పార్థసారధి కొత్తగా చేరిన వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, రామకృష్ణ, ఆచారి, గోవిందు తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News