Monday, 15 June 2026 02:02:37 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

బాల్య వివాహాలకు చెక్ – బాలికల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి : డీఎస్పీ భార్గవి..

Date : 23 May 2026 10:36 AM Views : 73

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అలసందగుత్తి గ్రామంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, బాలికల విద్య మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ “బాల్య వివాహాలు వద్దు – బాలికల చదువు ముఖ్యం” అని పేర్కొన్నారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి స్వయం సమృద్ధి సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల బాలికల ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని తెలిపారు. మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్, ఓటీపీలు, నకిలీ లింకులు, సోషల్ మీడియా మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం 112 హెల్ప్‌లైన్, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్లను వినియోగించుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి , సీఐ నల్లప్ప, ఎస్ఐలు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :