Saturday, 18 April 2026 06:05:09 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పై కేసు నమోదు చెయ్యాలి

Date : 09 April 2026 05:14 PM Views : 16

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా రాజేష్ తలే, ముఖ్య నాయకులు. రాజాం, విజయనగరం జిల్లా దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ABNలో కొత్త పలుకు పేరుతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ని, పార్టీని ముఖ్యంగా పార్టీ నాయకుల భార్యలను *నీచ, నికృష్టమైన భాషతో దూషించిన వైనం మీ అందరికీ తెలిసిందే, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకపోగ, మరింత దిగజారి ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ఈ రోజు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజేష్ తలే నేతృత్వంలో ముఖ్య అతిథిలుగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు, గజపతినగరం అసెంబ్లీ పరిశీలకులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురం జగన్ మోహన్ రావు,నాలుగు మండలాలు చెందిన ముఖ్య నాయకులు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పలుకులకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాధాకృష్ణ ను అరెస్టు చేయాలంటూ రాజాం పట్టణంలో పోలీస్ స్టేషన్ కు చేరుకొని.. సబ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.కేసు నమోదు చేసి రసీదు ఇవ్వాలని కోరడం జరిగింది. అనంతరం డా.రాజేష్ తలే మీడియా ముఖంగా మాట్లాడుతూ.. మావిగన్ (MAVIGUN)కు భయపడి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆంధ్రజ్యోతిలో తొలి పలుకులు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై నాయకులపై అసభ్య పదజాలం వాడిన రాధాకృష్ణకు తొందర్లోనే తగిన బుద్ధి చెప్తాం అని అన్నారు. కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడము హేయనీయని.. మహిళ లోకం తలదించుకునే విధంగా రోత రాతలు రాస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన దూయ్యిబట్టారు. రాష్ట్ర ప్రజలు మహిళలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలు అక్రమాలకు ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ రాధాకృష్ణ వంతపడే క్రమంలోనే ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంపీపీలు , జడ్పిటిసిలు,రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :