DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజల్లో మమేకమై క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను మరింత పెంపొందేలా పని చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వివిధ వీఐపీ పర్యటనలు, ఉత్సవాలు, బందోబస్తుల్లో ఏఆర్ విభాగం పోలీసులు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కన్వర్షన్ పొందిన వారందరూ ఏపీఎస్పీ 2003 బ్యాచ్‌కు చెందిన వారని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మొత్తం 12 మందిని కేటాయించగా, అందులో కర్నూలు జిల్లాకు 9 మందిని కేటాయించారు. వీరు కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ నుంచి కర్నూలు ఏఆర్‌కు వచ్చారు. అలాగే నంద్యాల జిల్లాకు ముగ్గురిని కేటాయించారు. ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.
Admin
DNB News