DNB News - ఆంధ్రప్రదేశ్ / : *జనసేనపార్టీ ఉద్యమి సభ్యత్వం – నవశకానికి నాంది, జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళంజిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పేర్కొన్నారు, జనసేనపార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు , లక్ష్యాలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసంమని, యస్సీ, యష్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపటమే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నారని , భారతదేశ రాజకీయాల్లోనే అత్యంత నిజాయితీ పరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఏకైక నాయకుడు కొణిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని ,జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాఅధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు,శ్రీకాకుళం నగర పరిధిలోని హయతీనగరం 43వ డివిజన్‌లో ఆదివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 43వ డివిజన్ ఇంచార్జ్ కొండ్రు వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సుడా చైర్మన్ , జనసేనపార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జ్ కొరికాన రవికుమార్, ఉమ్మడి శ్రీకాకుళంజిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, ప్రముఖ వైద్యులు మరియు జనసేనపార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు సమన్వయకర్త డాక్టర్ దానేటి శ్రీధర్ లు మాట్లాడుతూ ఈ రోజు నిర్వహిస్తున్న సభ్యత్వ కార్యక్రమం ద్వారా మనం కేవలం సభ్యులను నమోదు చేయడం కాదు, సమాజంలో మార్పు కోసం ముందుకు వచ్చే శక్తిని నిర్మిస్తున్నాం అని తెలియజేసారు. ఉద్యమి సభ్యత్వం తీసుకునే ప్రతి వ్యక్తి సమస్యలపై స్పందించే బాధ్యత గల పౌరుడిగా మారాలి. మన గ్రామం, మన పట్టణం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కొక్కరం కట్టుబడి పని చేయాలి” అని అన్నారు. అలాగే ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి కుటుంబం జనసేన కుటుంబంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గురు ప్రసాద్, కొండా ఉదయ్, మామిడి విష్ణు, వాడవలస సురేష్ కుమార్ ,బొట్ట శంకర్ యాదవ్,రఫీ ,తదితరులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News