DNB News - ఆంధ్రప్రదేశ్ / : నిరుపేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందని అని ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు. మంగళవారం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి క్యాంపు కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 17 మంది లబ్ధిదారులకు గురువారం దాదాపు 5,26,234 లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, బిజెపి నాయకులు ఉపేంద్ర కుమార్ , వెళ్ళాల మధుసూదన్ శర్మ, ఉషారాజు ,బెస్త నాగరాజు,జనసేన నాయకులు రేణువర్మ, పులిరాజు మరియు గ్రామ స్థాయీ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News