DNB News - ఆంధ్రప్రదేశ్ / : దళిత యువకుల జంట హత్యలను ఖండిస్తూ ఈనెల 25న ఛలో బి.మఠం ను జయప్రదం చేయండి -- MRPS జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, -- MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు. వివరణ : రెండు వారాల ముందు బి. మఠం మండలం లో జరిగిన దళిత యువకుల జంట హత్యల విచారణ ని వేగవంతం చేసి, నిందుతులను అరెస్ట్ చేసేలా పోలీసుల పై ఒత్తిడి పెంచేలా ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లాలని బి. మఠం తహసీల్దార్ కి MRPS, MSP, MEF నాయకులు వినతిపత్రం ను సమర్పించారు. ఈ సందర్బంగా దళిత యువకులు సతీష్, ఓబులేసులను చంపి, పక్కా ప్రణాళిక ప్రకారం ప్రమాదవశాత్తు గా చిత్రికరించిన విధానం, ముమ్మాటికీ హత్యలేనని అనుమానించడానికి కారణాలు, సాక్షాలు గురించి తహసీల్దార్ కి వివరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ... తక్షణమే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా MRPS జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ లు మీడియా తో మాట్లాడుతూ... దళిత యువకుల జంట హత్యలను నిరసిస్తూ ఈనెల 25న MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా, వేలాది మందితో జరగనున్న దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలనీ MRPS జాతీయ అధ్యక్షులు డా,, మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ లు పిలుపునిచ్చారు. దళిత యువకులు మరణించినప్పుడు లోతుగా పరిశీలంచకుండా తుతూ మంత్రంగా, నిర్లక్ష్యంగా ప్రమాదవశాత్తు మరనాలని తప్పుడుతడకల కేసులుగా కట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అవి పక్కాగా ప్లాన్ వేసి చంపారని అనడానికి పోలీస్ చట్టాలు, టెక్నికల్ అంశాలు చదవని,చదువురాని నిర్లక్ష్యరాసులకే 10 రకాలు కారణాలు �
Admin
DNB News