Wednesday, 17 June 2026 03:02:10 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మీడియా సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

Date : 10 April 2026 02:45 PM Views : 153

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మతి స్థిమితం లేని మంత్రి వాఖ్యలు ​అచ్చెన్నాయుడూ.. నోరు అదుపులో పెట్టుకో వైఎస్సార్ మరణంపై నీ వ్యాఖ్యలు నీచాతి నీచం మీడియా సమావేశంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాలవలస,ఏప్రిల్ 10​: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమదాలవలస తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసం చనిపోయిన వ్యక్తిపై బురద చల్లడం అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు.వైఎస్సార్ మరణించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నారంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ,ఆనాడు తండ్రి మరణవార్త విని కుప్పకూలిపోయిన కుటుంబానికి జగన్ అండగా ఉండి,అంత్యక్రియల వరకు అన్ని తానై చూసుకున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని, నీ రాజకీయ లబ్ధి కోసం ఇన్ని అబద్ధాలు ఆడతావా అని నిలదీశారు.మంత్రి అచ్చెన్నాయుడి విమర్శలకు కౌంటర్ ఇస్తూ,గార మండలం సింగపురం దగ్గర ఎర్రన్నాయుడుపై జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనలో నీ హస్తం లేదని చెప్పగలవా అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రణస్థలం మండలం వద్ద ఎర్రంనాయుడు వాహన ప్రమాదంలో మృతి చెందిన ఘటనలో నీ హస్తం లేదని చెప్పగలవా అంటూ తమ్మినేని ప్రశ్నించారు.వైఎస్సార్ పాదయాత్ర ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని,ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్,ఉచిత విద్యుత్ వంటి పథకాలు తరాల జీవితాలను మార్చాయని గుర్తు చేస్తూ,అలాంటి మహనీయుడిపై విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడమేనని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో 'మావిగన్' ప్లాన్-బి కి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని,అమరావతిలో జరుగుతున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఆదేశాలతో అచ్చెన్నాయుడు ఇటువంటి నీచమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.'అమరావతి వద్దు.. మావిగన్ ముద్దు' అని ప్రజలు అంటున్నారని,ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే అచ్చెన్నాయుడు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తమ్మినేని సీతారాం ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు బూర్జ జడ్పిటిసి బెజ్జపురం రామారావు బూర్జ ఎంపీపీ ప్రతినిధి కర్ణెన నాగేశ్వరరావు ఆముదాలవలస మాజీ జడ్పిటిసి బొడ్డేపల్లి నారాయణరావు రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రెటరీ బెండి గాంధీ తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: