DNB News - ఆంధ్రప్రదేశ్ / : పాత రేకుర్తి గ్రామానికి చెందిన రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల్లోని పట్టా భూములను నిషేధిత చట్టం 22/A(1)(d) సీలింగ్ యాక్ట్ కింద చేర్చడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని 19, 20, 21 వ డివిజన్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 నెలలుగా ఇక్కడ రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం అతలాకుతలమవుతోందని వారు పేర్కొన్నారు.కరీంనగర్ పరిధిలోని పాత రేకుర్తి, విద్యానగర్ పరిధిలోని 19, 20, 21 వ మున్సిపల్ డివిజన్లు, 125 సర్వే నెంబర్లలో విస్తరించి ఉన్న 536 ఎకరాలు.16 సర్వే నెంబర్లలో విస్తరించి ఉన్న 115 ఎకరాలు.మొత్తం 6,000 ఇండ్లు, 10,000 ప్లాట్లు, దాదాపు 30,000 మంది జనాభా మరియు 17,000 మంది ఓటర్లు ఈ సమస్యతో ప్రత్యక్షంగా నష్టపోతున్నారు.గత ఒక సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో అత్యవసర సమయాల్లో (వైద్యం, పిల్లల చదువులు, వివాహాలు) ఆస్తులను అమ్ముకోలేక, బ్యాంక్ రుణాలు పొందలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సాదాసీదా పట్టా భూములను సీలింగ్ యాక్ట్ కింద నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయమని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.ప్రభుత్వానికి,మున్సిపల్ డివిజన్ల ప్రజాప్రతినిధులు, బాధితులు, కాలనీల అసోసియేషన్ల తరఫున జిల్లా కలెక్టర్ , రెవెన్యూ శాఖ అధికారులు, ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసారు.తక్షణమే రెవెన్యూ రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.రేకుర్తి, విద్యానగర్ పట్టా భూములను నిషేధిత 22/A జాబితా నుండి వెంటనే తొలగించాలి.నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించి 30 వేల మంది ప్రజల భవిష్యత్తుకు న్యాయం చేయాలని కోరుతున్నాము.రేకుర్తి, విద్యానగర్ 19, 20, 21 వ డివిజన్ల ప్రజలు, కాలనీ వాసులు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
Admin
DNB News