DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని ఆల్ఫా పాఠశాలలో ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను తరగతుల నుంచి బయటకు పంపిస్తూ, అందరి ముందూ అవమానించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈరోజు సిఐటియు కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజులు బకాయి ఉన్న పేరుతో చిన్నారులపై మానసిక ఒత్తిడి తెచ్చి, పాఠశాల నుంచి పంపించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న మొత్తంలో బకాయిలు ఉన్నా ఇలాంటి కఠిన చర్యలకు పాల్పడడం విద్యార్థుల హక్కులను ఉల్లంఘించడం అవుతుందని అన్నారు. విద్యా సంస్థలు వ్యాపార ధోరణి విడిచిపెట్టి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి, పాఠశాల యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Admin
DNB News