Wednesday, 17 June 2026 02:21:49 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆదోని జిల్లాగా ప్రకటించాలని 104వ రోజు రిలే నిరాహార దీక్ష

Date : 28 February 2026 11:28 AM Views : 83

DNB News - ఆంధ్రప్రదేశ్ / : MRPS ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 104వ రోజుకు చేరుకున్నాయి. ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆదోని ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు డిస్ట్రిక్ట్ పశ్చిమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని పేర్కొంటూ, ఆదోని జిల్లా కేంద్రంగా ఐదు నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని వివిధ ఉద్యమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించాలని వారు కోరారు. రైతుల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం, ఉన్నత విద్య పొందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటు, ఐదు నియోజకవర్గాల్లో రోడ్ల సమస్యల పరిష్కారం, ఆదోని పట్టణ రోడ్ల విస్తరణ వంటి అంశాల దృష్ట్యా ఆదోనిని జిల్లాగా ప్రకటించడం అత్యవసరమని జేఏసీ నాయకులు తెలిపారు. 104వ రోజు రిలే నిరాహార దీక్షలో ఎంఆర్పీఎస్ సంఘం నాయకులు జగన్ మాదిగ, కిరణ్ మాదిగ, భూదెబ్బ మాదిగ, పిఎస్ వీరేష్ మాదిగ, దత్తు మాదిగలతో పాటు జిల్లా సాధన జేఏసీ నాయకులు షకీల్ దీక్షలో కూర్చొన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా జేఏసీ నాయకులు పగడాల కోదండ, బండారి హనుమంతు మాదిగ, గమ్మల బాలస్వామి మాదిగ, వై.పి. నాగరాజు, దాసరి గోవిందు, దాసరి నరేష్, కుమార్, వైఎస్ఆర్ నగర్ రామకృష్ణ, నరేష్ యాదవ్, సుజ్ఞానమ్మ, సుభాష్, రామలింగయ్య (బీఎస్పీ) తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :