DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణ శివారు నేషనల్ హైవే రోడ్ పక్కన ఉన్న మండగిరి సర్వే నెంబర్ 586లో 24.23 ఎకరాల కొండ పోరంబోకు ప్రభుత్వ భూమిలో అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గత నెలలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదేశాలతో బీజేపీ నాయకులు రెవెన్యూ మరియు పంచాయతీ అధికారులతో కలిసి సంబంధిత భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడం సహించబోమని, వాటిని తప్పనిసరిగా స్వాధీనం చేసుకోవాలని సూచించారు. దీనిపై స్పందించిన అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే, ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లోకి చొరబడితే కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Admin
DNB News