DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ మరియు కన్సల్టెంట్స్ సమస్యల పరిష్కారానికి భూమి కేటాయింపు చేయాలని కోరుతూ A.P. Tax Practitioners and Consultants Association (APT PCA) ప్రతినిధులు అమరావతి లో రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, 2016 సంవత్సరంలో గుంటూరు కేంద్రంగా ఏర్పాటైన తమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ మరియు కన్సల్టెంట్స్ అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వాలు జారీ చేసే జి.ఓలు, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించడం, పన్నుల వసూళ్లలో శాఖతో సమన్వయం సాధించడం, పన్ను చెల్లింపుదారులకు సకాలంలో రిటర్నులు దాఖలు చేయడంలో సహకరించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. అదేవిధంగా, పన్ను చెల్లింపుదారులు మరియు ప్రాక్టిషనర్స్ ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ కార్యాలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలం కేటాయించాలని కోరారు. వారి వినతిని స్వీకరించిన శ్రీ కూన రవికుమార్ గారు సంబంధిత అధికారులతో చర్చించి సమస్యకు సాధ్యమైన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Admin
DNB News