DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గంలో కాన్స్టిట్యూయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంబించారు.ఈ కార్యక్రమాన్ని ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ శ్రీ కూన రవి కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆముదాలవలస ఇండస్ట్రియల్ ఏరియాలోని APIIC భవనంలో (అశోక పబ్లిక్ స్కూల్ ఎదురుగా) స్వర్ణాంధ్ర@2047 లక్ష్యంతో ఆమదాలవలస నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కీలకంగా పనిచేయనుంది. ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించి నియోజకవర్గ అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడం ఈ యూనిట్ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News