DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో జప్తు చేయబడిన బైక్ మాయమైన ఘటనలో అప్పటి సీఐ శ్రీరాం చట్ట ప్రకారం వ్యవహరించలేదనే ఆరోపణలపై విచారణ జరపాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డిజిపి మరియు కర్నూలు జిల్లా ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో జప్తు చేసి వారి సంరక్షణలో ఉన్న ఒక పౌరుని బైక్ మాయం అయిన ఘటనపై కేసు నమోదు చేసి కోర్టులో నిజానిజాలు తేల్చాల్సిన సీఐ శ్రీరాం, చట్టాలను మరియు కోర్టు ప్రక్రియలను పక్కనపెట్టి స్వయంగా బాధితునికి డబ్బు చెల్లించారనే విషయం తీవ్ర ఆందోళన కలిగించిందని నూర్ అహ్మద్ తెలిపారు. ఇలాంటి చర్యలు పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి ఈ ఘటనపై ఎస్పీ స్థాయి అధికారి ద్వారా సమగ్ర విచారణ జరిపించి, చట్టబద్ధంగా వ్యవహరించని అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని ప్రభుత్వానికి అందజేశామని నూర్ అహ్మద్ తెలిపారు.
Admin
DNB News