DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరంలోని కిడ్స్ వరల్డ్ నుండి కల్లూరు దర్వాజా వరకు చేపట్టనున్న రహదారి విస్తరణ (ఆర్డీపి-2) పనులకు సంబంధించి టిడిఆర్ బాండ్ల జారీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక కే.ఎం. హాస్పిటల్ సమీపంలో రహదారి విస్తరణకు సంబంధించిన కొలతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. టిడిఆర్ బాండ్ల జారీ ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా మొత్తం 180 ఆస్తులు ప్రభావితమవుతుండగా, ఇప్పటివరకు సుమారు 50 మంది బాధితులు సమ్మతి పత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు. మిగిలిన బాధితులు కూడా వెంటనే తమ పత్రాలు సమర్పిస్తే టిడిఆర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ సిటీ ప్లానర్ వై. వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మధుగోపాల్, మాజీ కార్పొరేటర్ కురుబ పరమేష్, ఇంచార్జీ మహేబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News