DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని రేషన్ షాపుల్లో సక్రమంగా రేషన్‌తో పాటు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆదోని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలోని అనేక రేషన్ దుకాణాల్లో కేవలం నాలుగు నుంచి ఐదు రోజులపాటు మాత్రమే సరుకులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని నిత్యావసర వస్తువులను అందించకుండా కొన్ని సరుకులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందుబాటులో ఉంచి పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ మరియు నిత్యావసర సరుకులను సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు మోహన్, కార్యదర్శి వెంకటేష్, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News