DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో, ఆదోని క్రికెట్ సంఘం పర్యవేక్షణలో మే 25 నుండి 27 వరకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో అన్ని వయసుల మహిళా క్రికెటర్లకు ప్రాక్టీస్ మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం మహిళా క్రికెటర్లలో నైపుణ్యాభివృద్ధి, పోటీ స్ఫూర్తి మరియు క్రీడాపట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న మహిళా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదోని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ విట్టా రమేష్, కార్యదర్శి వెంకటేష్, సభ్యులు వెంకటేష్ బాబు మరియు జోనాథన్ హాజరయ్యారు. వారు ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ, మహిళా క్రికెట్‌కు మరింత ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లందరికీ విజయవంతమైన టోర్నమెంట్‌తో పాటు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు.
Admin
DNB News