DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ఈ రోజు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్‌షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీలోని సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, పార్టీ క్రమశిక్షణ, నాయకులు,కార్యకర్తల బాధ్యతలు వంటి అంశాలపై విస్తృతంగా వివరించారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను ఆయన బలంగా చెప్పారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు. పార్టీపై నమ్మకంతో పనిచేసే గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు మరియు కార్యకర్తలే రానున్న రోజుల్లో పార్టీకి బలమని పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన సమిష్టి కృషి ద్వారానే తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేయవచ్చని ఆయన అన్నారు.
Admin
DNB News