Monday, 15 June 2026 01:57:04 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆదోని జిల్లా సాధన 150వ రోజు దీక్ష సభను ఘనంగా నిర్వహిద్దాం – జేఏసీ పిలుపు...

Date : 12 April 2026 09:58 AM Views : 32

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 150వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో, ఏప్రిల్ 14న నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు పగడాల కోదండ, వైపి నాగరాజు, బండారి హనుమంతు, సుజ్ఞానమ్మ పిలుపునిచ్చారు. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ప్రస్తుతం 147వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న రామకృష్ణ, గాజుల రామాంజనేయులు, సుభాష్ చంద్రబోస్, పి. కుమార్ (ఐఎఫ్‌టియు)లకు జేఏసీ నాయకులు వైపి నాగరాజు, బండారి హనుమంతు, సుజ్ఞానమ్మ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏప్రిల్ 14న 150వ రోజు సందర్భంగా సర్వమత సామూహిక నిరాహార దీక్షతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదోని పట్టణంతో పాటు ఐదు నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఇదే సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, మాజీ మార్కెట్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్, క్రిస్టియన్ యూనియన్ అధ్యక్షులు రెవ. జి. ఆనంద్ రాజు తదితరులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్ని కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఐక్యంగా పోరాడితేనే ఆదోని జిల్లా సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దాసరి గోవిందు, గుమ్మల బాలస్వామి, దాసరి నరేష్, ఎస్. బాలన్న, పిఎస్. వీరేష్, మాదాసు జగన్, బండారి గిడ్డయ్య, హెబ్బటం రాజు, జిఎస్ దత్తు, ఎం. శాంతరాజు, వీరాంజి, మఠం వీరభద్రప్ప, గంగపుత్ర సంఘం నాయకులు బెస్త ప్రకాష్, బెస్త దీపక్, గోల్డ్ శీను, సాంబగల్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :