DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని కాటన్ మార్కెట్ యార్డ్‌లో ఈ నెల 7, 8, 9 తేదీలలో యువశక్తి కబడ్డీ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీలలో మొత్తం 40 జట్లు పాల్గొని ఉత్కంఠభరితంగా పోటీపడ్డాయి. విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా సిద్ధార్థ నాయుడు రూ.50,000, రెండో బహుమతిగా ఠాగూర్ చౌదరి రూ.30,000, మూడో బహుమతిగా జిందె శంకర్ రూ.20,000, నాలుగో బహుమతిగా శ్రీకాంత్ చౌదరి రూ.10,000 అందించారు. అదనంగా నాలుగు కప్పులు, రెండు షీల్డులను అమర్ ప్రకాష్ స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆరెకల్ రామకృష్ణ , ఠాగూర్ నాయుడు, బుద్ధారెడ్డి, రాజా గౌడు తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన యువశక్తి కబడ్డీ టీం సభ్యులను పలువురు అభినందించారు.
Admin
DNB News