Monday, 15 June 2026 01:40:13 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక ప్రగతికి దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుంది, బేష్ గా ఉంది – ఎమ్మెల్యే కూన రవికుమార్

Date : 02 February 2026 11:34 AM Views : 82

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర బడ్జెట్‌గా ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి కీలకమైన మౌళిక సదుపాయాలు, విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ రంగాలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయడం అభినందనీయమని తెలిపారు. ✅దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను నిలబెట్టే దిశగా ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడంలో, MSME రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్ర బడ్జెట్ స్పష్టమైన దృష్టిని చూపిందని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌలభ్యం, ఉపాధి అవకాశాల పెంపు ద్వారా యువతకు భవిష్యత్ భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు. ✅వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకున్న చర్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు రైతులకు మేలు చేస్తాయని చెప్పారు. అలాగే వైద్య, ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల విస్తరణ, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా బడ్జెట్ రూపకల్పన చేయడం ప్రశంసనీయమన్నారు. ✅హెరిటేజ్ టూరిజం విస్తరణకు బడ్జెట్‌లో ఇచ్చిన ప్రాధాన్యం దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశంగా మారుతుందని అన్నారు. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, వారసత్వ ప్రాంతాల అభివృద్ధి ద్వారా పర్యాటకం పెరిగి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని స్పష్టం చేశారు. ✅ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి *రూ.64,362 కోట్ల నిధుల కేటాయింపు* రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ✅దేశం, రాష్ట్రం రెండింటి సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌కు ఎమ్మెల్యే కూన రవికుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :