Monday, 15 June 2026 01:40:53 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

విద్యార్థులతో వంట, పారిశుద్ధ పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలి..ఎస్ఎఫ్ఐ డిమాండ్

Date : 17 March 2026 03:34 PM Views : 36

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు: కోసిగి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో వంట పనులు, పారిశుద్ధ పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కర్నూలు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరూల్ కమర్‌కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సాయి ఉదయ్, కార్యదర్శి రంగప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ కోసిగి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో వంట పనులు, పారిశుద్ధ పనులు చేయించడం విద్యార్థి హక్కుల ఉల్లంఘన అని అన్నారు. ఈ ఘటన జరిగి పది రోజులు గడిచినా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. అంతేకాకుండా విద్యార్థులకు త్రాగునీటిని డస్ట్‌బిన్‌లలో నిల్వ చేసి ఇవ్వడం, అసభ్య పదజాలంతో విద్యార్థులను దూషించడం వంటి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి విచారణ జరిపినప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఘటనపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి విద్యార్థులతో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అధికార విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ప్రిన్సిపల్‌కు సహకరిస్తున్న జిల్లా సమగ్ర శిక్ష అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నగర నాయకులు శివ పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :