Monday, 15 June 2026 01:40:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ (SDP)కింద శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస కు రూ.41 లక్షలు నిధులు విడుదల

Date : 05 February 2026 03:00 PM Views : 126

DNB News - ఆంధ్రప్రదేశ్ / : గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం పార్టీ పేరు చెప్పి కక్ష కట్టి పనులు పూర్తి చేసినప్పటికీ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడం వలన ఎన్నో వేలమంది రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయారు ఈ అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అహర్నిశలు శ్రమించి నిధులు ఈరోజు విడుదల కావడంలో విశేష కృషి చేశారు శాసనసభ్యులు కూన రవికుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ (SDP) శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం కు రూ.41,35,763/- నిధులను విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్లానింగ్ (V) డిపార్ట్మెంట్ నుంచి G.O.Rt.No.20 ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు 2014–19 కాలంలో SDP కింద మంజూరైన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం విడుదల చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. SDP మరియు MGNREGS నిధుల సమ్మేళనంతో చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో SDP కింద చేపట్టిన పనుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం రూ.41,35,763/- నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పనుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా, వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆర్థిక శాఖ (FMU-GAD-2) ద్వారా 2025–26 బడ్జెట్ అంచనాల కింద నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ కావడంతో, వాటి ఆధారంగా ఇప్పుడు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ నిధుల విడుదలతో పెండింగ్ బిల్లులు చెల్లింపులు పూర్తై, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆర్థిక ఊరట కలగనుంది అని ఎమ్మెల్యే చెప్పారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :