DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని గ్రామీణ మరియు పట్టణ పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఆదోని మండల పరిధిలోని బాసర కోడు గ్రామానికి చెందిన శ్రీమతి మారమ్మ మరియు కీ.శే. నాగన్న దంపతుల కుమార్తె శృతి వివాహానికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న సాయిప్రసాద్ రెడ్డి, వెంటనే స్పందించి నగదు సహాయం అందించి వారికి అండగా నిలిచారు. తమ కష్టకాలంలో పెద్దన్నలా ఆదుకున్నందుకు ఆ కుటుంబ సభ్యులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలకు స్పందించే ఆయన మానవత్వంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు బసరుకోడు ఈరన్న కూడా పాల్గొన్నారు.
Admin
DNB News