DNB News - తెలంగాణ / : ప్రైవేటు కాలేజీలు, పాఠశాలలో నిర్వాహకులు విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ కాల్వ మధుబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరియు కరీంనగర్ టౌన్ లో పలు ప్రైవేటు పాఠశాలలోనీ నిర్వాహకులు విద్యార్థుల వద్ద అధిక ఫీజులు, డొనేషన్ లు వసూలు చేస్తున్నరని అటువంటి కాలేజీలు, పాఠశాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ పాఠశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజుల నియంత్రణ చట్టం పకడ్బండిగా అమలు చేయాలని అన్నారు.తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు పెంట అజయ్ పటేల్
Admin
DNB News