DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఇన్‌ఛార్జ్ సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అజయ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి. అజయ్ కుమార్ కర్నూలులోని హెచ్.ఎన్.ఎస్.ఎస్ యూనిట్-4లో ఎస్.డి.సిగా విధులు నిర్వహిస్తూనే, అదనంగా ఆదోని ఇన్‌ఛార్జ్ సబ్ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టి సేవలు అందించారు. ఇక ఆదోని సబ్ కలెక్టర్ పదవికి ప్రభుత్వం ఇంకా కొత్తగా ఎవరినీ నియమించలేదు.
Admin
DNB News